Jump to content

అయినంపూడి శ్రీలక్ష్మి

వికీపీడియా నుండి
అయినంపూడి శ్రీలక్ష్మి
అయినంపూడి శ్రీలక్ష్మి


వ్యక్తిగత వివరాలు

జననం 15 ఆగస్టు, 1967
బోధన్‌, నిజామాబాద్‌ జిల్లా
జాతీయత భారతీయురాలు
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 2021, ఏప్రిల్ 3న హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన ఆజాది కా కవి సమ్మేళన కార్యక్రమంలో కవిత్వ పఠనం చేస్తున్న అయినంపూడి శ్రీలక్ష్మీ

అయినంపూడి శ్రీలక్ష్మి తెలుగు కవయిత్రి, రచయిత్రి. ఆకాశవాణి, హైదరాబాదులో రెండున్నర దశాబ్దాలుగా అనౌన్సరుగా పనిచేస్తున్నారు. శ్రీలక్ష్మి అనేక వ్యాసాలు, పుస్తకాలు, కవితలు ప్రచురించారు. కొన్ని డాక్యుమెంటరీలు కూడా తయారుచేసారు.[1] సినిమాలపై అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆలిండియా రేడియోలో పేరొందిన వ్యక్తులతో ఇంటర్వ్యూ కార్యక్రమాలను నిర్వహించారు.[2] 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ సాహిత్యకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు.[3]

జీవిత విశేషాలు

[మార్చు]
2017 ఉగాది కవి సమ్మేళనంలో సత్కారం అందుకుంటున్న అయినంపూడి శ్రీలక్ష్మీ

ఆమె నిజామాబాదు జిల్లా లోని బోధన్ లో 1967 ఆగస్టు 15 న జన్మించారు. ఆమె పూర్వికులు 1940ల్లో ఆంధ్రా నుంచి ఇక్కడికి వలస వచ్చారు.[4] విజ్ఞానశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ ను గిరిరాజ్ కళాశాలలో పూర్తిచేసారు. రాజనీతి శాస్త్రంలో మాస్టర్ డిగ్రీని డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో చేసారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఎడ్ చేసారు. ఆమె హైదరాబాదు ఆకాశవాణిలో అనౌన్సరుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఆమెకు కవిత్వం, చిత్రనిర్మాణాలపై ఆసక్తి ఎక్కువ. ఆమె అనేక ఆర్టికల్స్, పుస్తకాలు, కవితలను వివిధ విషయాలలో (ఫైన్ ఆర్ట్స్, సినిమాలు) ప్రచురించారు.[5]

సాహితీ సేవలు

[మార్చు]

ఆమె పాఠశాల విద్యాభ్యాసం నుండే సాహితీ ప్రస్థానం ప్రారంభించారు. పాఠశాలలో కవితలు వ్రాసేవారు. పాఠశాల మ్యాగజైన్ కు ఎడిటరుగా ఉండేవారు. ఆమె 2000లో ఇందూర్ స్పెషల్ ఇష్యూలోని ఎడిటోరియల్ మెంబరుగా ఉన్నారు. ఆమె యోజన మాసపత్రిక, ప్రజాశక్తిలో వివిధ రచయితలు, కవులు వ్రాసిన కవితలు, కథలు, నవలలకు సమీక్షలు వ్రాసారు. 2001లో "అలలవాన", 2003 లో దృక్కోణం (భావ చిత్రాలు) పుస్తకాలను ప్రచురించారు. 2011 లో లైఫ్@చార్మినార్ అనే దీర్ఘ కవితను ప్రచురించారు. ఆమె ఒక డాక్యుపోయం అనే కొత్త సాహిత్య ప్రక్రియతో దీర్ఘ కవితను ప్రవేశపెట్టారు. ఈ కవిత 5వ కాఫిసో జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్పెషల్ జ్యురీ అవార్డును కైవసం చేసుకున్నారు. ఆమె వ్రాసిన "వెన్నెల దుఃఖం"కవితకు 2012, జనవరి 18న రంజని కుందుర్తి అవార్డు వచ్చింది.[6]

రచనలు

[మార్చు]
బతుకమ్మ పండుగ సందర్భంగా 2019 అక్టోబరు 4న హైదరాబాదులోని రాజ్ భవన్ లో జరిగిన బతుకమ్మ వేడుకలలో అయినంపూడి శ్రీలక్ష్మి

కవిత్వ సంపుటిలు

[మార్చు]
  1. అలలవాన
  2. దృక్కోణం
  3. దర్వాజా మీద చందమామ
  4. కవిత్వమే ఓ గెలాక్సీ

దీర్ఘ కవిత

[మార్చు]
  1. లైఫ్ @చార్‌మినార్[7]
  2. వూండెడ్ హార్ట్ (మోనోలాగ్ ఆఫ్ ఏ వూండెడ్ హార్ట్ పేరుతో ఇంగ్లీష్ లోకి, గాయగూండ హృదయ స్వగత కన్నడంలోకి అనువాదం అయింది)[8]

లేఖా సాహిత్యం

[మార్చు]
  1. కొత్త ప్రేమలేఖలు[9]
  2. ఇట్లు మీ కరోనా

అనువాదాలు

[మార్చు]
  1. ఖలీల్ జిబ్రాన్ (కథలు)[10]

అక్షరయాన్ స్థాపన

[మార్చు]

శ్రీలక్ష్మి, 500మంది తెలుగు మహిళా రచయిత్రుల విభాగంగా తన నిర్వహణలో 2019 జూన్ నెలలో అక్షరయాన్‌ అనే తెలుగు మహిళా రచయిత్రుల ఫోరంను ఏర్పాటుచేశారు.[11] పద్దెనిమిది సాహితీ ప్రక్రియల్లో సమకాలీన అంశాలపై రచనలు సాగించడం, రచయిత్రులను సంఘటితం చేయడం లక్ష్యంగా ఏర్పడిన అక్షరయాన్ ఫోరంకు శ్రీలక్ష్మి ‌వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నారు.[12]

ఇతర వివరాలు

[మార్చు]
2017 ఉగాది కవి సమ్మేళనంలో కవిత్వ పఠనం చేస్తున్న అయినంపూడి శ్రీలక్ష్మీ
  1. కరోనా 19పై శ్రీలక్ష్మి రాసిన కరోనాకి ఓ రిటర్న్ గిఫ్ట్[13] అనే కవిత 2020, మార్చి 23న నమస్తే తెలంగాణ పత్రికలోని చెలిమె విభాగంలో ప్రచురితమయింది. ఆ కవితను చూసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫోన్ లో స్వయంగా శ్రీలక్ష్మిని అభినందించడమేకాకుండా ఆరోజు జరిగిన పత్రికా సమావేశంలో ప్రశంసలు అందజేశాడు.[14][15]

అవార్డులు

[మార్చు]
  1. ''లైఫ్ ఎట్ చార్మినార్'' డాక్యుమెంటరీకి స్పెషల్ జ్యూరీ అవార్డు (పాలపిట్ట 5వ జాతీయ షార్ట్-డాక్యుమెంటరీ ఫిల్మోత్సవం, కరీంనగర్, 2011 ఏప్రిల్ 10)[16]
  2. "కీర్తి పురస్కారం" - ఉత్తమ రచయిత్రి విభాగం - తెలుగు విశ్వవిద్యాలయం, 2013.[17]
  1. "ప్రతిభా పురస్కారం" - ఉత్తమ రచయిత్రి విభాగం - తెలుగు విశ్వవిద్యాలయం, 2014.
  2. ''అమృతలత - అపురూప అవార్డ్స్ 2019'' - రేడియో రంగం, తెలుగు విశ్వవిద్యాలయం, 2019 మే 12.
  3. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2020 మార్చి 8.[18][19]
  4. ''ఆచార్య పాకాల యశోదారెడ్డి సాహితీ పురస్కారం'' - తెలంగాణ సారస్వత పరిషత్తు, 2021 ఆగస్టు 11.[20]

హోదాలు

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఫ్యామిలీ ఫిలిమ్, జిందగీ, నమస్తే తెలంగాణ, హైదరాబాదు, 2011 జూలై 5, పుట 10.
  2. "About Inampudi Sreelaxmi". Archived from the original on 2015-08-01. Retrieved 2015-06-30.
  3. ఈనాడు, ప్రధానాంశాలు (8 March 2020). "30 మంది మహిళలకు పురస్కారాలు". Archived from the original on 8 March 2020. Retrieved 9 March 2020.
  4. Andhrajyothy (24 April 2021). "సమాజం కోసం అక్షరయాన్‌". www.andhrajyothy.com. Archived from the original on 5 May 2021. Retrieved 5 May 2021.
  5. "అలుపెరుగని 'అక్షరయానం' | మానవి | www.NavaTelangana.com". NavaTelangana. 2022-11-06. Archived from the original on 2022-11-06. Retrieved 2022-11-06.
  6. నమస్తే తెలంగాణ, తెలంగాణ (26 March 2020). "కేసీఆర్ మెచ్చిన అయినంపూడి శ్రీలక్ష్మి కవిత ఇదే". ntnews. Archived from the original on 26 March 2020. Retrieved 26 March 2020.
  7. "May | 2012 | కినిగె బ్లాగు". Archived from the original on 2021-05-07. Retrieved 2021-04-08.
  8. "| Telugu Women Magazine". vihanga.com. Retrieved 2021-04-08.
  9. "లేఖ... ప్రేమలేఖ ! - Namasthetelangaana". Dailyhunt. Retrieved 2021-04-08.{{cite web}}: CS1 maint: url-status (link)
  10. "Khaleel Jibran". www.telugubooks.in. Archived from the original on 2021-02-25. Retrieved 2021-04-08.
  11. "United in letter and spirit". The New Indian Express. 2022-09-04. Archived from the original on 2022-09-04. Retrieved 2022-09-04.
  12. నమస్తే తెలంగాణ, జిందగీ (24 November 2020). "అక్షరయాన్‌.. నవ సమాజం దిశగా." ntnews. Archived from the original on 24 November 2020. Retrieved 25 February 2021.
  13. గ్రేట్ తెలంగాణ, టాప్ స్టోరీస్ (26 March 2020). "ఈ కవిత కేసీఆర్‌ కూ నచ్ఛేసింది." Great Telangaana. Archived from the original on 2021-02-26. Retrieved 7 April 2021.
  14. సాక్షి, ఫ్యామిలీ (29 June 2020). "కవిత్వమూ కరోనా". Sakshi. Archived from the original on 7 August 2020. Retrieved 7 April 2021.
  15. డైలీహంట్, నమస్తే తెలంగాణ (26 March 2020). "జనచైతన్యం కోసం కవితలు..'రిటర్న్ గిఫ్ట్ 2 కరోనా'" (in ఇంగ్లీష్). Archived from the original on 7 April 2021. Retrieved 7 April 2021.
  16. "చార్మినార్‌కే.. కినారే". Sakshi. 2015-01-29. Archived from the original on 2015-06-29. Retrieved 2022-06-17.
  17. "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.
  18. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 March 2020). "ఉమెన్‌ సేఫ్టీ స్టేట్‌ తెలంగాణ : మంత్రులు". Archived from the original on 9 March 2020. Retrieved 9 March 2020.
  19. TelanganaToday. "TS to honour Captain Fatima, Sravanthi on Women's Day". Telangana Today. Retrieved 2021-04-08.{{cite web}}: CS1 maint: url-status (link)
  20. telugu, NT News (2021-08-12). "సృజనాత్మక రచయిత్రి ఐనంపూడి శ్రీలక్ష్మి". Namasthe Telangana. Archived from the original on 2022-06-17. Retrieved 2022-06-17.
  21. 2009 టివి నంది అవార్డుల వెల్లడి, వార్త, హైదరాబాదు, 2010 నవంబరు 10.

ఇతర లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.